Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

పవన్ 'పంజా' బ్లాక్ బస్టర్ గ్యారంటీ...ఎందుకంటే...!

పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘పంజా’. విష్ణువర్థన్ దర్శకత్వంలో ఆర్కామీడియా వర్క్స్, సంఘమిత్రా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్య తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాలపై అటు బాలీవుడ్‌లోనూ ఇటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికంతటికీ కారణం ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ నుంచి ఎటువంటి సినిమా కోరుకుంటున్నారో ఆ సినిమా టైటిల్, స్టిల్స్, పాటలు, ట్రైలర్స్ చూసాకా 'పంజా' సినిమా నుంచి ఏమి ఎక్సపెట్ చేయవచ్చు అవన్నీ ఇందులో ఉన్నాయన్న సంతృప్తితో ఫ్యాన్స్ తమ హీరోకి ఈసారి సూపర్ డూపర్ హిట్ గ్యారెంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఎదురు చూస్తున్నారు.


మొదట రిలీజ్ అయిన పంజా ట్రైలర్స్, పోస్టర్స్ ఆడియోను బట్టి ఫ్యాన్స్ తమ అంచనాలను పెంచుకోవడానికి కారణం పంజా కథలో సిరియస్‌నెస్ మిస్ అవ్వకుండానే, ఎంటర్‌ టైన్‌ మెంట్ వేలో పంజా వుంది. తర్వాత కొత్తదనం రొటీన్ కి బిన్నంగా స్టైలిష్ టేకింగ్ కచ్చితంగా కొత్తదనంగానే అనిపించింది. పవన్‌ కళ్యాణ్ రొటీన్ స్టైల్స్ భిన్నంగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పవన్‌కల్యాణ్ ఈ సినిమా చేసాడనిపించడం వలన దీనికి టైటిల్ ఎక్స్షన్ ఇవ్వవచ్చు అంటున్నారు ఫ్యాన్స్.
మాస్ స్టోరి, క్లాస్ టేకింగ్, క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, యూత్ కు కావలసిన ప్రేమ, పల్లెటూరిలో జరిగే మనసుకు హత్తుకునే సన్నివేశాలు, కల్‌కొత్తలో జరిగే మాఫియా బ్యాక్‌ డ్రాప్. పవన్ కల్యాణ్ విజృంభణ. అన్నీ కనిపిస్తున్నాయి. నిర్మాతలు కేవలం డబ్బు పెట్టడమే కాదు, టీం వర్క్ ఒక పద్దతి ప్రకారం జరిగి మంచి అవుట్‌ పుట్ రావడానికి ఎంతో కష్టపడ్డారు. సినిమాకు కావలసిన పబ్లిసిటీ కూడా స్పెషల్ కేర్‌తో చేస్తున్నారు. అందుకే 'పంజా' బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఇటు పవన్ ఫ్యాన్సే కాక, ఇండస్ట్రీలోనూ ధీమా వ్యక్త చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 9 వరకు ఆగాల్సిందే.

Panjaa Powerful @ Leaked Dialogues Exclusive

1. మబ్బు పడితే వర్షం పడుతుంధాని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు-గాలే వస్తే తూపాన్ వస్టుంధాని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు.కానీ నేను కొడితే బ్రతుకుతవని ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్ధు.
2. నా స్పీడ్ కి మా అన్నయ్యే బ్రేక్ వేయలేకపోయాడు.. మెరేంటీ రా వేసేది?
3.  తాత ల చరిత్ర చెప్పుకొనే అలవాటు లెధు మాకు...మేము సృస్టించే చరిత్రలే భావి తారాలకు భగవత్ గీత.
4. చరిత్రలో అర్జునుడు శత్రువులని అంధారికన్నా ధుర్మర్గాంగా చంపాడనినువ్వు విన్నావు.నేను చంపడం చూశావంటే నీ ఒపీనియన్ మార్చుకుంటావు.
5.  సహాయం పొంధినవాడుకృతజ్ఞత చూపకపోవడం ఎంత తప్పో---చేసినవాడు కృతజ్ఞత కోరడం అంటే తప్పు

వర్మ @ రామారావు లాగా నాగార్జునకి పేరోవస్తుంది

బాలయ్యకు భార్యగా, తల్లిగా నటిస్తున్న జయసుధ

బ్యాంకాక్ లో మహేష్, కాజల్ రొమాన్స్

Press Note @ Business Man Release Date

Sakshi Article @ Mahesh BusinessMan

Click on Image to view in a Bigger Size

సూపర్ స్టార్ అల్లుడు కోరిక తీర్చుకుంటున్నాడు

Sayali Bhagat accused Amitab for Sexual Haraasment.

బాలీవుడ్ బాద్ షా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇంకొందరు ఫిల్మ్ పర్సనాల్టీస్ పై లైంగిక ఆరోపణలు చేసింది హీరోయిన్ సయాలీ భగత్. బ్లేడ్ బాబ్జీలో అల్లరి నరేష్ సరసన నటించిన ఈమె అంతకు ముందు నుంచే బాలీవుడ్ లో విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. వాటన్నింటి కంటే ముందే మిస్ ఇండియా గానూ గెలిచింది. తన అందంతో బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఫలించలేదు. బ్లేడ్ బాబ్జీ సినిమా మంచి రెస్పాన్స్ అందుకున్నా సయాలీ భగత్ కు మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో అవకాశాలు లేని ఈమె సినీ పరిశ్రమకు గుడ్ బై చెబుదామనుకుంటుందట. అయితే అంత కంటే ముందు సినీ పరిశ్రమలో తను ఎలా లైంగికంగా వేధింపులకు గురయ్యింది అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి, ఫిల్మ్ పర్సనాల్టీస్ కు బుద్ధి చెప్పాలనుకుంటుందట. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో అమితాబ్ పాదాలకు నమస్కారం చేయబోతే ఆయన తాకకూడ చోట తాకారని, హౌస్ పుల్ సినిమాలో అవకాశం కావాలంటే తన ముందు నగ్నంగా నిలబడమని నటుడు, దర్శకుడు సాజిద్ ఖాన్ అన్నాడని, ఆర్య బబ్బర్ అనే మరో నటుడు బూతు ఎస్.ఎం.ఎస్ లు, ఎమ్.ఎమ్.ఎస్ లు పంపాడని ఆరోపణలు చేసింది. ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయంటుంది. మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయవచ్చు కదా అంటే మాత్రం నిరాకరిస్తుందట. దీంతో ఈ అమ్మడు చేస్తున్న ఆరోపణలో నిజమెంత అనేది బాలీవుడ్ జనాలకు అర్ధం కావడం లేదు. అవకాశాలు లేకపోవడంతో పబ్లిసిటీ కోసం ఇలా స్థాయి దిగజారి మాట్లాడుతుందా అనే వారు కూడా ఉన్నారు.

Press Note @ Mahesh, Samantha again

Dookudu No1 @ Magadheera No2 in Tollywood

అయిదేళ్ళ కిందట రిలీజ్ ఐన పోకిరి 45 కోట్లు కొల్లగొట్టి 75 ఏళ్ళ సిని చరిత్ర ని తిరగ రాసింది , కాని మగధీర ఆ రికార్డు ని 5 వారాల్లో క్లీన్ స్వీప్ చేసింది .ఇప్పుడు దూకుడు మగధీర రికార్డు ని 4 వారాలకే తుడిచి పెట్టేసింది .మా సినిమా సంపాదించింది 58 కోట్లే అని ఒక వెబ్సైటు కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు అల్లు శిరీష్.అభిమానుల ప్రకారం అయితే సినిమా 250 రోజులు విజయవంతంగా ఆడింది ,అందుకనే ౭౦ కోట్ల దాక సంపాదించి ఉంటుందని భావిస్తున్నారు .కాని పేరొందిన దిస్త్రిబ్యుటర్ ల ప్రకారం సినిమా 65 కోట్లదాకా సంపాదించింది .అలా చుస్కున్న దూకుడు ఇప్పటికే 60.45 కోట్లు కొల్లగొట్టింది , ఎంత లేదన్న 75 కోట్లదాకా లాగటం ఖాయం ఎందుకంటే సినిమా ఇంకా భీభత్సంగా ఆడుతుంది .కాని మెగా అభిమానులు దీనికి అంగీకరించట్లేదు ,దూకుడు కి అంతే సీన్ లేదని మగధీర టేకింగ్ , స్టొరీ ఈ సినిమా కి కంప్యారిసన్ కే రావని కొట్టి పారేస్తున్నారు ,అసలు సామాన్యుడి ప్రశ్నేంటంటే దూకుడు ని మగధీర తో కంపేర్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అని ,ఏ సినిమా స్టామిన ఆ సినిమా ది, ఇప్పుడు దూకుడు లో ఉన్న కామెడీ మగధీర లో ఉందా లేదే ?మరి అలాంటప్పుడు అసలు కంపేర్ చెయ్యాల్సిన అవసరమే లేదు .పైగా నిన్న అల్లు శిరీష్ గారు తన Twitter పేజి లో మగధీర ని కొట్టే సినిమా ఇప్పటి వరకు రాలేదని రాబోదని వచ్చిన అది పవర్ స్టార్ పంజా నే అని సొల్లు కబుర్లు కూసాడు .దీంతో ప్రిన్స్ అభిమానుల షాక్ గి గురయ్యారు .సినిమా అనలిస్ట్ అని చెప్పుకొని తిరిగే అల్లు శిరీష్ ఇలాంటి వార్తలు మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలని కోరుకుంటున్నారు .ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలని బైట పెట్టమని అందరు కోరుకుంటున్నారు.సో ప్రస్తుతానికి దూకుడే నేo .1 !!

చిరు తర్వాత నెంబర్ వన్ స్థానం ప్రిన్స్ కేనా...?!

టాలీవుడ్ లో ఇటీవల సరైయిన హిట్ లేని సమయంలో మహేష్ దూకుడు సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా పండుగ చేసుకుంటున్నారు. పోకిరి తరువాత మహేష్ కు హిట్ లేకున్నా హీరోగా అతని ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని దూకుడు ప్రూవ్ చేసింది. దూకుడు కథలో పెద్దగా దమ్ము లేకున్నా మహేష్ నటనతో పాటు అన్నీ సమ పాళ్ళలో కలవడంతో పాటు సరైన సమయంలో విడుదల కావడం కూడా కలసి వచ్చిందనే చెప్పాలి.
ఏ సినిమాలు లేనందునే దూకుడు 80 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టిందని జూ ఎన్టీఆర్ ఊసరవల్లి విడుదలయితే దూకుడు కొంత తగ్గుతుందని గుసగుసలు అక్కడక్కడ వినిపించాయి. అయితే ఊసరవెల్లి కి యావరేజ్ టాక్ రావడం, దూకుడు పై ఆ సినిమా ప్రభావమేదీ లేదని కలక్షన్లు ఏ మాత్రం తగ్గలేదని దూకుడు ప్ర్రూ చేసుకుంటోంది. 

ఊసరవల్లి విడుదలయ్యాక దూకుడు రికార్డులు కూడా బద్దలవుతాయన్నారు. అయినా అలాంటిదేమీ జరగా లేదు. పైగా జూ ఎన్టీఆర్ మళ్ళీ లావయాడని అంటుండగా మహేష్ గ్లామర్ పెరిగింది. ఈ పరిస్థితిలో టాలీవుడ్ లో ప్రస్తుతానికి మహేష్ బాబు నం 1 హీరోగా మారాడు. మళ్ళీ జూ ఎన్టీఆర్ హిట్ కొట్టేవరకు మహేష్ దూకుడు తగ్గదు. దాదాపు 30యేళ్ళు నెంబర్ వన్ స్థానాన్ని ఏలిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఆ స్థానాన్ని వదులుకున్నాడు. 
ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం మహేష్ బాబు లేక ఎన్టీఆర్ కే ఉందని విశ్లేషకులు తేల్చారు. ప్రస్తుతానికి మాత్రం నెంబర్ వన్ స్థానం మహేష్ దే అని సుస్పష్టం చేసేస్తున్నారు. మహేష్ ‘దూకుడు’ రికార్డు స్థాయి వసూళ్ళు సాధించింది. ఈ సినిమాతో పోల్చితే ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ తక్కువ వసూళ్లే సాధించగలిగింది. అంతే కాకుండా పోకిరి కాంబినేషన్ లో బిజినెస్ మ్యాన్ వస్తుండటంతో ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఇక నెంబర్ వన్ స్థానం మహేష్ దే అంటున్నారు. కానీ ఒక్క సినిమాకే ఈ పట్టం కట్టడం కరెక్ట్ కాదు కబాట్టి భవిష్యత్తు సినిమాలు ఎవరు నెంబర్ వన్నో తేల్చుతాయని పరిశీలకులు అంటున్నారు.

సిద్ధార్థ్ - శృతి హాసన్ రీల్ లవర్సా.. రియల్ లవర్సా...?!

రీల్‌ లైఫ్‌ నుంచి రియల్‌లైఫ్‌లో కలిసిమెలిసి ఉంటున్న జంట సిద్దార్థ్‌, శృతిహాసన్‌. వీరి గురించి రకరకాల కథలు వినడమేకానీ... చూడ్డానికి సినిమాలో చూడాల్సిందే. అనగనగా ఓ ధీరుడు చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌'. 

ఈ చిత్ర కాన్సెప్ట్‌.. ఫ్రెండ్‌ అనే వ్యక్తి ఎలా ఉండాలనేది. ఇందులో ఇద్దరు స్నేహితులుగా ఉంటూ.. విడదీయలేని బంధంగా ముడిపడిన జంటగా సిద్దార్థ్‌, శృతి నటించారు. అయితే సినిమా ఆడియో వేడుక ఇటీవలే శిల్పకళావేదికలో జరిగింది. అంత పెద్ద హాలు ఏ పెద్ద హీరో చిత్రానికిగాను సరిపోదు. కానీ దిల్‌రాజు తను సినిమా షూటింగ్‌ తీసిన రెండు కాలేజీల నుంచి స్టూడెండ్స్‌ను ఆహ్వానించారు. 


వారంతా వచ్చేసరికి ఫంక్షన్‌లో కిక్‌ వచ్చింది. స్టేజీపై డాన్స్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించారు. వాటిని అనుగుణంగా శృతి, సిద్దార్థ్‌లు కుర్చీలో కూర్చొని మూమెంట్స్‌ ఇవ్వడం అందరినీ ఆహ్లాదపర్చింది. ఆ తర్వాత రెండు పాటలకు వీరిద్దరూ డయాస్‌పైకి వెళ్ళి తన్మయత్వంతో పాటలకు నృత్యం చేశారు. 

వారి హావభావాలను బట్టి ఇద్దరూ మాంచి లవర్స్‌గా కన్పించారు. వీరిని చూసి కుర్రకారు ఈలలు, గోలలు చేశారు. పెళ్ళెప్పుడు అంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని ఒకటిరెండు సార్లు అడిగి... సిద్దార్థ్‌ వినపడనట్లు బిహేవ్ చేసి... ఆమెతో చిందులు వేశాడు. శృతి మాట్లాడుతూ... సిద్దార్థ్‌ అంటే చాలా ఇష్టం. మంచి కో-ఆర్టిస్టు అంటూ కితాబిచ్చింది. అంతవరకేనా.. ఇంకేమైనా ఉందా.. అని అక్కడి కుర్రకారు పెద్దగానే అరిచారు.

Dookudu 100 cr Share Poster @ Exclusive

Dookudu Collections @ Krishna

Pawan Kalyan 'Panjaa' @ Preview

పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రూపొందిస్తున్న సినిమా 'పంజా' తెలుగులో విష్ణువర్థన్‌కి ఇదే తొలి సినిమా. అజిత్‌తో తీసిన 'బిల్లా' డైరెక్టర్‌గా అతను తమిళంలో ప్రసిద్ధుడు. 'పంజా'లో పవన్ సరసన నాయికలుగా సారాజేన్ డయాస్, అంజలా లావణియా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 'పులి' వంటి డిజాస్టర్ తర్వాత చాలా కసితో ఈ సినిమా చేస్తున్నాడు పవన్. 'పంజా'లో ఆయన గడ్డంతో కొత్త గెటప్పులో కనిపించబోతున్నాడు.

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని విష్ణువర్థన్ తీర్చిదిద్దుతున్నాడు. పవన్ 'ఖుషి' సినిమాలో మొదట కోల్‌కతా నేపథ్యం కనిపించిన సంగతి తెలిసిందే. అదివరకు చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో కనిపించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ 'పంజా'కి వర్తిస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
'క్రిష్', 'మై నేం ఈజ్ ఖాన్', 'త్రీ ఇడియట్స్' సినిమాలకి పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం మరో ఎట్రాక్షన్ కానున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బేనర్లపై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో పాటల్నీ, డిసెంబర్‌లో సినిమానీ విడుదల చేయడానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తారాగణమైన ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.

తారక్ అదుర్స్ అన్న దాసరి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో ఆయన నటనను  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రశంసించారు.  ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన ఊసరవెల్లి సినిమాను తిలకించారు. అనంతరం దాసరి మాట్లాడుతు 'తారక్ ఊసరవెల్లి'లో చాలా బాగా చేశాడు. ఈ విజయం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా రెండు పెద్ద చిత్రాలు మంచి విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా డీల్ చేశారని.ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ లోను మంచి ఆసక్తిని రేకెత్తించేలా చిత్రీకరించారన్నారు. సెకండాఫ్ సబ్జెక్ట్ బాగా హ్యాండిల్ చేశాడని... ప్లాష్ బ్యాక్ లో తమన్నా ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందని దాసరి అభినందించారు.
తారక్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, ఓవిధంగా ఈ సినిమాలో తారక్ కొత్తగా కనిపించాడని దాసరి పేర్కొన్నారు. దేవిశ్రీ సంగీతం బాగుందని, ఈ సినిమాలో మూడు పాటలు బాగా నచ్చాయని, రీరికార్డింగ్ అద్భుతంగా ఉందన్నారు. తన శిష్యుడు వక్కంతం వంశీ మంచి కథను ఇచ్చాడన్నారు. ఈ సందర్భంగా దాసరి చిత్ర దర్శక,నిర్మాతలతో పాటు తారక్ కు అభినందనలు తెలిపారు. టెక్నికల్ ఎక్స్ లెన్స్ వున్న 'ఊసరవెల్లి' తప్పకుండా మరింత పెద్ద హిట్ అవుతుందన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో ఆయన నటనను  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రశంసించారు.  ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన ఊసరవెల్లి సినిమాను తిలకించారు. అనంతరం దాసరి మాట్లాడుతు 'తారక్ ఊసరవెల్లి'లో చాలా బాగా చేశాడు. ఈ విజయం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా రెండు పెద్ద చిత్రాలు మంచి విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా డీల్ చేశారని.ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ లోను మంచి ఆసక్తిని రేకెత్తించేలా చిత్రీకరించారన్నారు. సెకండాఫ్ సబ్జెక్ట్ బాగా హ్యాండిల్ చేశాడని... ప్లాష్ బ్యాక్ లో తమన్నా ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందని దాసరి అభినందించారు.
తారక్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, ఓవిధంగా ఈ సినిమాలో తారక్ కొత్తగా కనిపించాడని దాసరి పేర్కొన్నారు. దేవిశ్రీ సంగీతం బాగుందని, ఈ సినిమాలో మూడు పాటలు బాగా నచ్చాయని, రీరికార్డింగ్ అద్భుతంగా ఉందన్నారు. తన శిష్యుడు వక్కంతం వంశీ మంచి కథను ఇచ్చాడన్నారు. ఈ సందర్భంగా దాసరి చిత్ర దర్శక,నిర్మాతలతో పాటు తారక్ కు అభినందనలు తెలిపారు. టెక్నికల్ ఎక్స్ లెన్స్ వున్న 'ఊసరవెల్లి' తప్పకుండా మరింత పెద్ద హిట్ అవుతుందన్నారు.

దూకుడు ధాటికి తట్టుకోలేక పోతున్న ఊసరవెల్లి

దూకుడు కంటే ఊసరవెల్లి ఎక్కువ ధియేటర్ లో రిలీజ్ అయినట్టు కలర్ ఇచ్చిన, మొదటి రోజు దూకుడు కంటే ఎక్కువ కల్లెక్ట్ చేసినట్టు ఫిగర్స్ చూపించిన మహేష్ స్టామిన ముందు ఎన్తీఆర్  నిలబడలేకపోయాడని కల్లెక్సన్ ని బట్టి తెలుస్తుంది. చాలా ఏరియలలో ఊసరవెల్లి ధియేటర్స్ చాలా వరకు తగ్గిపోయయి. గుంటూరు లాంటి టౌన్లో ఒక ధియేటర్ లో ఊసరివెల్లి కి ప్రేక్షకులు లేక షో కాన్సుల్ చేసారన్న విషయాన్నీ ఆభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దిన్ని బట్టి దూకుడు ఎ రేంజ్ లో దూసుకుపోతుందో అర్ధంచేసుకోవచ్చు. ఇది తెలుసుకున్న మహేష్ ఫాన్స్ దూకుడు నడుస్తున్న ధియేటర్ దగ్గర రిలీజ్ రోజు గుర్తుకువచ్చేల సంబరాలు చేసుకుంటున్నారు.  

రామ్ చరణ్ కట్నం గురించి ....!

రామ్ చరణ్ 120 కోట్లు కట్నం తీసుకోబోతున్నాడంటూ పాపులర్ తమిళ పత్రికలు "మాలై మలర్" వంటి వార్తల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ వివాహం,కట్నం హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ న్యూస్ ఏమిటంటే...చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కట్నం 120 కోట్లు తీసుకోబోతున్నారు. అలాగే గిప్ట్ గా ఓ చిన్న విమానం కూడా తీసుకోబోతున్నారు. దీన్ని జర్మనీలో తయారు చేశారని చెప్తున్నారు. ఈ నెలాఖరుకు ఆ ప్లైట్ హైదరాబాద్ చేరనుందని ప్రచురించారు.ఈ న్యూసే ఇప్పుడు అక్కడ మీడియాలో హాట్ ఐటమై కూర్చుంది. ఇక రామ్‌చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థమే అందరూ మాట్లాడుకునేంత ఘనంగా జరగనుందని సమాచారం. నవంబర్‌లో వీరి నిశ్చితార్థాన్ని జరపడానికి ఇటు చిరంజీవి కుటుంబం అటు కామినేని కుటుంబం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటలు వేదికగా తీసుకోవటం లేదు. హైదరాబాద్‌కి 105 కిలోమీటర్ల దూరంలోని ఉపాసనా తాతయ్య ఉమాపతికి చెందిన దోమకొండగడిని ఈ నిశ్చితార్థానికి వేదికగా చేయనున్నారు . అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. 
ఇప్పటికే దోమకొండగడికి సంబంధించిన మరమ్మత్తులను ఆరంభించారు. మూడువందల ఏళ్ల నాటి ఈ కోటను పునరుద్ధరించి, అలంకరింపజేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారని వినికిడి. ఇదిలా వుండగా ఈ నిశ్చితార్థ విందు కూడా అద్బతంగా ఉండబోతోంది. దానికోసం నెల్లూరుకి చెందిన చెయ్యి తిరిగినవారితో మాంసాహార వంటకాలను, తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారితో శాకాహార వంటకాలను వండించనున్నారట. ఇదిలా వుండగా రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్థం దోమకొండగడిలో జరుగుతోందని తెలిసి ఆ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు, హీరో అభిమానుల తాకిడి ఇప్పటినుంచే అధికమవుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

ప్రపంచంలో త్రీ ఇడియట్స్ తర్వాత ‘దూకుడు’దే రెండోస్థానం....

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్.

ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది.

ఒక్క పాత్రలో అన్ని ఎమోషన్లు పలికించడం కష్టం అనిపించలేదా?

అనిపించలేదు. నాకిది నచ్చిన కథ. దాంతో ఇష్టంగా చేశాను. మొదటి మూడురోజులు మీరన్నట్లు కాస్త కష్టం అనిపించినా తర్వాత ఎంజాయ్ చేస్తూ ఈ కేరక్టర్ చేశాను. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఒకపక్క, పోలీసుగా ఒకపక్క, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో మరో పక్క... ఇలా విభిన్నమైన యాంగిల్స్ ఉన్నాయి ఆ పాత్రలో. ఒక విషయంలో మాత్రం ‘దూకుడు’ నాకు చాలా హెల్ప్ చేసింది. మొన్నటిదాకా ‘పోకిరి’ చట్రంలో ఇరుక్కుపోయాన్నేను. ఆ ఇమేజ్ నుంచి బయటపడేసిన చిత్రం ‘దూకుడు’. ‘పోకిరి’ రికార్డుని బ్రేక్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్క పాత్రలో ఇన్ని షేడ్స్ పోషించాను కాబట్టి.. ఇక ఎలాంటి పాత్ర అయినా పోషించగలనన్న నమ్మకం నాకు ‘దూకుడు’ కలిగించింది.

మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?


నాన్నగారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడమే బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన 80 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. పూరి జగన్నాథ్ అయితే బ్రహ్మానందంకి ధీటుగా కామెడీ చేశావన్నాడు. అలాగే రాజమౌళి కూడా. ఇంతమంది కాంప్లిమెంట్లు పొందడం చాలా ఆనందంగా ఉంది.

సినిమాలో మీ పాత్ర కాకుండా మీకు నచ్చిన మరో పాత్ర ఏమిటి?
ప్రకాష్‌రాజ్ కేరక్టర్. శ్రీను వైట్ల దాన్ని చాలా కొత్తగా డిజైన్ చేశాడు.

ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది.

విదేశాల్లో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడంపట్ల మీ ఫీలింగ్?

‘3 ఇడియట్స్’ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో ‘దూకుడు’ ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
కేరక్టరైజేషన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. అయితే వెంకటేష్‌గారితో చేయడం మాత్రం ఆనందంగా ఉంది. ఆయనది ఫ్రెండ్లీ నేచర్. ఇందులో మేమిద్దరం అన్నదమ్ములుగా నటిస్తున్నాం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.