తారక్ అదుర్స్ అన్న దాసరి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో ఆయన నటనను  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రశంసించారు.  ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన ఊసరవెల్లి సినిమాను తిలకించారు. అనంతరం దాసరి మాట్లాడుతు 'తారక్ ఊసరవెల్లి'లో చాలా బాగా చేశాడు. ఈ విజయం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా రెండు పెద్ద చిత్రాలు మంచి విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా డీల్ చేశారని.ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ లోను మంచి ఆసక్తిని రేకెత్తించేలా చిత్రీకరించారన్నారు. సెకండాఫ్ సబ్జెక్ట్ బాగా హ్యాండిల్ చేశాడని... ప్లాష్ బ్యాక్ లో తమన్నా ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందని దాసరి అభినందించారు.
తారక్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, ఓవిధంగా ఈ సినిమాలో తారక్ కొత్తగా కనిపించాడని దాసరి పేర్కొన్నారు. దేవిశ్రీ సంగీతం బాగుందని, ఈ సినిమాలో మూడు పాటలు బాగా నచ్చాయని, రీరికార్డింగ్ అద్భుతంగా ఉందన్నారు. తన శిష్యుడు వక్కంతం వంశీ మంచి కథను ఇచ్చాడన్నారు. ఈ సందర్భంగా దాసరి చిత్ర దర్శక,నిర్మాతలతో పాటు తారక్ కు అభినందనలు తెలిపారు. టెక్నికల్ ఎక్స్ లెన్స్ వున్న 'ఊసరవెల్లి' తప్పకుండా మరింత పెద్ద హిట్ అవుతుందన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో ఆయన నటనను  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రశంసించారు.  ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన ఊసరవెల్లి సినిమాను తిలకించారు. అనంతరం దాసరి మాట్లాడుతు 'తారక్ ఊసరవెల్లి'లో చాలా బాగా చేశాడు. ఈ విజయం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా రెండు పెద్ద చిత్రాలు మంచి విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా డీల్ చేశారని.ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ లోను మంచి ఆసక్తిని రేకెత్తించేలా చిత్రీకరించారన్నారు. సెకండాఫ్ సబ్జెక్ట్ బాగా హ్యాండిల్ చేశాడని... ప్లాష్ బ్యాక్ లో తమన్నా ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందని దాసరి అభినందించారు.
తారక్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, ఓవిధంగా ఈ సినిమాలో తారక్ కొత్తగా కనిపించాడని దాసరి పేర్కొన్నారు. దేవిశ్రీ సంగీతం బాగుందని, ఈ సినిమాలో మూడు పాటలు బాగా నచ్చాయని, రీరికార్డింగ్ అద్భుతంగా ఉందన్నారు. తన శిష్యుడు వక్కంతం వంశీ మంచి కథను ఇచ్చాడన్నారు. ఈ సందర్భంగా దాసరి చిత్ర దర్శక,నిర్మాతలతో పాటు తారక్ కు అభినందనలు తెలిపారు. టెక్నికల్ ఎక్స్ లెన్స్ వున్న 'ఊసరవెల్లి' తప్పకుండా మరింత పెద్ద హిట్ అవుతుందన్నారు.