Fans Dharna @ Businessman Theaters!!

బిజినెస్ మేన్ థియేటర్ల వద్ద అభిమానులు ధర్నాకు దిగారు. టిక్కెట్లు నేరుగా అమ్మకుండా బ్లాక్ లో విక్రయిస్తున్నారని, ముందే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని చెప్పి....బయట బ్లాక్‌లో రూ. 50 టిక్కెట్‌ను రూ. 500 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల యజమానుల దోపిడీని నిరసిస్తూ....భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం బ్లాక్ టికెట్లు అమ్మే వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని, టిక్కెట్లన్నీ ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ లోనే అమ్ముడయ్యాయని అంటున్నారు.


స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రసాతిసారి ఇలాంటి ఆందోళనలు, టిక్కెట్లు దొరకలేదనే అసంతృప్తులు షరా మామూలే. అడ్వాన్స్ బుకింగ్ ను కొందరు వ్యతిరేకిస్తుండగా, కొందరు సమర్థిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తొక్కిసలాటల్లాంటి అవాంఛనీయ ఘటనలు తగ్గాయని యజమానులు అంటున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ ప్రయత్నించని వారు మాత్రం ఇలా చేయడం వల్ల టిక్కెట్ల కోసం థియేటర్లకు వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం దాదాపు 2వేల థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.