Mahesh Behind @ Pawan-Puri Movie!

పూరి, పవన్ కళ్యాన్ ను ఎలా ఒప్పించాడు అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లో షికార్లు చేస్తుంది. పూరి, పవన్ కాంబినేషన్ లో .. బద్రి సినిమా చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా రాలేదు. అసలు పూరికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి పవన్ . పూరి ఇటీవల చేసిన సినిమా మంచి టాక్ రావటంతో.. పవన్ అభిమానులు పూరిని పవన్ కళ్యాణ్ తో సినిమా ఎందుకు చేయటంలేదని అడగటం, పూరి తప్పకుండా చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పూరి దర్శకత్వంలో సినిమా చేయటానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే .. ఈ మద్య కాలంలో పవన్ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. దానివలన అభిమానులకు మంచి హిట్ సినిమా ఇవ్వాలని పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ ఆర్థికంగా కూడా కొంచె వెనబడినట్లు, కుటుంబ సమస్యల వలన మెంటల్ గా దెబ్బతిన్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.


పూరి జగన్నాథ్ కూడా .. ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆర్థికంగా ఎదగలంటే.. పవన్ ఒక హిట్ సినిమా తీస్తే చాలు అని పూరి తన సన్నిహితుల దగ్గర అంటున్నట్లు వార్తలు . అందుకోసమే. ఇప్పటి వరకు పూరి 24 సినిమా లు చేసినట్లు తెలిసింది. తన 25వ సినిమా పవన్ కళ్యాణ్ తీసి గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుందామని పూరి చూస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరి మద్య మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. అతనే హీరో మహేష్ బాబు, ఇటీవలన పూరి దర్శకత్వలో వచ్చిన బిజినెస్ మేన్ హిట్ సాధించిన విషయం తెలిసింది. పవన్, మహేష్ బాబు ఇద్దరు మంచి స్నేహితులు. పూరితో ఒక సినిమా చేయమని మహేష్ పవన్ తో చెప్పినట్లు టాలీవుడ్ గుసగుసలు. అందుకే పూరి పవన్ ఒకే అనటంతో.. వెంటనే ..సినిమా షూటింగ్ ప్రారంభించాడు. బిజినెస్ మేన్ కంటే తక్కువ ఖర్చుతో , అది తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని పూరి అంటున్నాడు.


అదే పూరి మాటల్లోనే ....మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా ఫార్ములాతో పవన్ కళ్యాణ్ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ సేమ్ ఫార్ములా ఉపయోగించి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అసలు ఈ ఫార్ములా ఏమిటంటే....అతి తక్కువ కాలంలో సినిమాను పూర్తి చేయడమే. బిజినెస్ మేన్ చిత్రాన్ని చాలా తక్కువ కాలంలో మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసి ప్రొడక్షన్ కాస్ట్ చాలా వరకు తగ్గించి నిర్మాతకు ఇతర పెద్ద సినిమాలతో పోలిస్తే రోజు రూ. 7 లక్షల వ్యయం చొప్పున తగ్గించాడు.


పవన్ కళ్యాణ్‌తో రూపొందించబోయే ‘కెమెరామెన్ గంగతో రాబాబు’ చిత్రాన్ని కూడా అదే ఫార్ములాతో తీసి నిర్మాతను సేవ్ చేయాలని, కథ, స్క్రిప్టు ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్న పూరి అక్టోబర్ 18న సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు కూడా. మరి బిజినెస్ మేన్ సినిమా ఫార్ములా....పవన్ కళ్యాణ్‌కు పనిచేస్తుందా? లేదా? అనేది త్వరలోనే తేల నుంది.