Rajamouli @ Comments on 'Businessman' Collections!!

మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేసారు. అందులో...బిజినెస్ మ్యాన్ ఓపినింగ్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మహేష్ మ్యానియా కంటిన్యూ అవుతోంది. పూరి డైలాగులు,క్యారెక్టరైజేషన్ సినిమాకు ఫ్యూయిల్ గా పనిచేసాయి. కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసారు. అలాగే సంక్రాంతి గురించి ఆయన ట్వీట్ చేస్తూ...‘‘శుక్రవారం ఉష్ణోగ్రత 11 డిగ్రీలు ఉంటుందని వాతావరణ శాఖవారు పేర్కొన్నారు. అంటే భోగిమంటలకు అనువైన వాతావరణం అన్నమాట. ప్రతి ఏడాదీ మొత్తం మా కుటుంబ సభ్యులందరం కలిసి, భోగి మంటలు వేసి, చలి కాచుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా మిస్ కాలేదు. భోగి మంటల్లో ఇడ్లీలు వండుకుని తినడం మా అలవాటు.
మా అమ్మమ్మ సంక్రాంతి కథ చెబుతుంటే... పిల్లలు, పెద్దలు అందరూ వింటూ ఇడ్లీలు లాగించేశాం. అలాగే ఇంట్లో తయారుచేసిన బొబ్బట్లతో మా ఇల్లంతా ఘుమఘుమలాడిపోయింది’’అన్నారు. అలాగే ఆయన తన ఈగ ఫస్ట్ లుక్ పోటోలను సైతం ఈ సంక్రాంతి సందర్భంగా ట్విట్టర్ లో పెట్టారు. అవి ఆయన అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి.