రామ్ చరణ్ కట్నం గురించి ....!

రామ్ చరణ్ 120 కోట్లు కట్నం తీసుకోబోతున్నాడంటూ పాపులర్ తమిళ పత్రికలు "మాలై మలర్" వంటి వార్తల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ వివాహం,కట్నం హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ న్యూస్ ఏమిటంటే...చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కట్నం 120 కోట్లు తీసుకోబోతున్నారు. అలాగే గిప్ట్ గా ఓ చిన్న విమానం కూడా తీసుకోబోతున్నారు. దీన్ని జర్మనీలో తయారు చేశారని చెప్తున్నారు. ఈ నెలాఖరుకు ఆ ప్లైట్ హైదరాబాద్ చేరనుందని ప్రచురించారు.ఈ న్యూసే ఇప్పుడు అక్కడ మీడియాలో హాట్ ఐటమై కూర్చుంది. ఇక రామ్‌చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థమే అందరూ మాట్లాడుకునేంత ఘనంగా జరగనుందని సమాచారం. నవంబర్‌లో వీరి నిశ్చితార్థాన్ని జరపడానికి ఇటు చిరంజీవి కుటుంబం అటు కామినేని కుటుంబం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటలు వేదికగా తీసుకోవటం లేదు. హైదరాబాద్‌కి 105 కిలోమీటర్ల దూరంలోని ఉపాసనా తాతయ్య ఉమాపతికి చెందిన దోమకొండగడిని ఈ నిశ్చితార్థానికి వేదికగా చేయనున్నారు . అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. 
ఇప్పటికే దోమకొండగడికి సంబంధించిన మరమ్మత్తులను ఆరంభించారు. మూడువందల ఏళ్ల నాటి ఈ కోటను పునరుద్ధరించి, అలంకరింపజేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారని వినికిడి. ఇదిలా వుండగా ఈ నిశ్చితార్థ విందు కూడా అద్బతంగా ఉండబోతోంది. దానికోసం నెల్లూరుకి చెందిన చెయ్యి తిరిగినవారితో మాంసాహార వంటకాలను, తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారితో శాకాహార వంటకాలను వండించనున్నారట. ఇదిలా వుండగా రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్థం దోమకొండగడిలో జరుగుతోందని తెలిసి ఆ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు, హీరో అభిమానుల తాకిడి ఇప్పటినుంచే అధికమవుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.